భూదానోద్యమం 75వ వజ్రోత్సవ వేడుకలు
BHNG: భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో భూదానోద్యమం 75వ వజ్రోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూదానోద్యమ దాత వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.