పోడు భూముల వివాదం
ASR: ఎట్టపాక మండలం మాధవపేట, కన్నాపురం, పట్టుచీర, లక్ష్మీపురం, బూరుగువాయి గ్రామాల పోడు భూముల సమస్యపై ప్రతినిధులు చింతూరు ఐటీడీఏ పీవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. డిసెంబర్ 24, 2025 నుండి సర్వేలకు అనుమతి ఉన్నప్పటికీ, కొన్ని భూములు తెలంగాణ అటవీ శాఖ అభ్యంతరాల కారణంగా నిలిచిపోయినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.