శిరివాడలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్దంతి వేడుకలు
KKD: పెద్దాపురం మండలం శిరివాడ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్దంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాల్పించారు.