'బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి'
W.G: సీపీఐ తణుకులో పట్టణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ.. కులగణన చేపట్టి బీసీలకు సంక్షేమ పథకాలు, అలాగే రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.