వన్ టౌన్ సిబ్బందిని అభినందించిన కమిషనర్

KNR: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ కరీంనగర్‌లో బుధవారం పెళ్లి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో 10 తులాల బంగారు ఆభరణాల కలిగిన బ్యాగును పోగొట్టుకున్నది. ఆభరణాలను గుర్తించి పట్టుకుని, బాధితురాలికి అందించిన ఘటనలో కృషి చేసిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, అతని సిబ్బందినీ నగర సీపీ అభినందించారు.