ఐక్య ఉద్యమాలకు కేంద్ర బిందువు సీఐటీయూ

ప్రకాశం: ఐక్య ఉద్యమాలకు కేంద్ర బిందువు సీఐటీయూ అని సీఐటీయూ జిల్లా కార్యదర్శిలు జీ.శ్రీనివాసులు తెలియజేశారు. ఆదివారం కనిగిరి మండల సీఐటీయూ పదో మహాసభ స్థానిక సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలోని మోదీ, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలనను చేస్తున్నాయని అన్నారు. సమస్యల పరిష్కారం పోరాటంతోనే సాధ్యమవుతుందన్నారు.