VIDEO: ఈదరాడలో ఆకట్టుకున్న కోలాట నృత్య ప్రదర్శన

VIDEO: ఈదరాడలో ఆకట్టుకున్న కోలాట నృత్య ప్రదర్శన

కోనసీమ: మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామ దేవత పాళ్లమ్మ అమ్మవారి జాతరలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో లయబద్ధంగా నృత్యం చేస్తూ ఆధ్యాత్మిక గీతాలు ఆలపించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం కోలాట బృందాన్ని గ్రామస్థులు ఘనంగా సత్కరించారు.