టిప్పర్ ఢీకొనడంతో రైతుకు తీవ్ర గాయాలు

టిప్పర్ ఢీకొనడంతో రైతుకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: బి. కొత్తకోట మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చలిమామిడి గ్రామానికి చెందిన రైతు శంకర (55) తీవ్రంగా గాయపడ్డాడు. సొంత పనిమీద బైక్‌పై వెళ్తుండగా బురుజుపల్లి సమీపంలో వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు.