ఏప్రిల్ 28న విశాఖ మేయర్ ఎన్నిక

VSP: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ ఎన్నిక ఏప్రిల్ 28న ఉదయం 11 గంటలకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కిమషనర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. ఏప్రిల్ 24లోగా ఎన్నికల షెడ్యూల్, ఆహ్వాన పత్రాలు సభ్యులకు పంపిస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు.