లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం..!

లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం..!

కడప: లింగ అసమానత, లింగ వివక్షత నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీఎం ఆంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం వేముల మండలం కొత్తపల్లిలో లింగ అసమానత నిర్మూలనకు ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలికలపై హింస, గృహహింస వంటి వాటి అన్నీ చట్టపరంగా నేరాలని ఆయన స్పష్టం చేశారు.