సీఎంఆర్ఎఫ్‌తో పేదలకు ఆర్థిక భరోసా: MLA
ADB: సీఎంఆర్ఎఫ్‌తో పేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. సోనాల మండల కేంద్రానికి చెందిన సరితకు మంజూరైన రూ. 60 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును MLA అనిల్ జాదవ్ నేరడిగొండలోని ఆయన నివాసంలో గురువారం అందజేశారు. బాధితులు వైద్య ఖర్చుల వివరాలను MLA క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని సూచించారు.