అక్రమ నిర్మాణాలకు అడ్డాగా అల్లాపూర్..!
HYD: హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్, అల్లాపూర్ డివిజన్ అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారాయి. ఇక్కడ 50 గజాల నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలలో జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండానే బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.