ఘనంగా సాముహిక వరలక్ష్మీ వ్రత పూజలు

ఘనంగా సాముహిక వరలక్ష్మీ వ్రత పూజలు

కాకినాడ: పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పాదగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం మహిళలకు చీర, కుంకుమ కిట్లను పంపిణీ చేశారు.  పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 12,000 మంది మహిళలకు పాల్గొన్నారు.