వీఓఏలకు మొబైల్ ఫోన్లు పంపిణీ

వీఓఏలకు మొబైల్ ఫోన్లు పంపిణీ

AKP: వెలుగు వీఓఏలు అంకితభావం చిత్తశుద్ధితో పనిచేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. శనివారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మండలానికి చెందిన 74 మంది వీఓఏలకు ఎమ్మెల్యే మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో వీఓఏల పాత్ర ఎంతో కీలకమైనదిగా పేర్కొన్నారు.