పూతలపట్టులో అంబేద్కర్ జయంతి వేడుకలు
CTR: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూతలపట్టు మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.