కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగులు, వృద్ధులు ధర్నా

WGL: వికలాంగులు, వృద్ధులకు ప్రభుత్వం ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పెన్షన్ రూ. 4,000 నుంచి రూ. 6,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, విహెచ్‌పీఎస్ సంస్థల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కళ్ల పెళ్లి ప్రణీదీప్ మాదిగ తదితరుల పాల్గొన్నారు.