ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం

ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం

BDK: టేకులపల్లి మండలం తంగేళ్లతండా గ్రామంలో అయ్యప్ప స్వాములు మాల ధారణ ఇరుముడి కార్యక్రమానికి సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వాముల ఆశీర్వాదం తీసుకుని శబరిమల వెళ్లే స్వాములకు కానుకలు సమర్పించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.