మే 14న దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ
కర్నూలు జిల్లాలో మే 14న మంత్రాలయంలో BSP ఆధ్వర్యంలో రాజకీయ చైతన్య సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన లక్ష్యంగా కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. 1950 ఆర్డర్ రద్దు, రిజర్వేషన్లు, ప్రత్యేక రక్షణ చట్టం వంటి డిమాండ్లు ముందుకు వచ్చాయి. సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.