ఎండలో వాహనాన్ని తీస్తున్నారా? జాగ్రత్త..!

ఎండలో వాహనాన్ని తీస్తున్నారా? జాగ్రత్త..!

కోనసీమ: భానుడు భగ్గుమంటున్నా సరే కొంత  మంది తమ అవసరాల నిమిత్తం బయటకి వెళ్తుంటారు. అయితే, మధ్యాహ్నం వేళ బయటకి వెళ్లే వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో రోడ్లు మరింత సెగలు గక్కుతుంటాయి. దీంతో  టైర్లలోని గాలి వ్యాకోచించి టైర్లు పేలే ప్రమాదం ఉంది. నీడలో పార్కింగ్ చేయడం మేలు. వీలైతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది.