శ్రీజీసీఎస్‌ఆర్ కళాశాల విద్యార్థి ఢిల్లీ గణతంత్ర వేడుకలకు ఎంపిక

రాజాం: శ్రీ జీసీఎస్‌ఆర్ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న ముచ్చుపల్లి ఉదయ కిరణ్ అనే విద్యార్థి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల 14(A) బెటాలియన్ నుండి ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవాలకు ఎంపికైనట్లు కళాశాల ఎన్.సి.సి కెప్టెన్ ఎస్. వెంకట్రావు తెలిపారు. ఎంపికైనందుకు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.పురుషోత్తం రావు అభినందనలు తెలిపారు.