VIDEO: డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని మహిళలు నిరసన
కృష్ణా: యనమలకుదురు గ్రామంలో నెలలుగా కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో డ్రైనేజ్ మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు దోమలు, వ్యాధులు ప్రబలే ప్రమాదం పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.