ప్రమాద బీమా చెక్కు అందజేత
WG: బాధిత కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని నరసాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు తెలిపారు. నరసాపురం 31వ వార్డుకు చెందిన కొండేటి జాన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ నేపథ్యంలో, ఇవాళ టీడీపీ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ, రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మృతుడు కొండేటి జాన్ భార్య కళ్యాణికి రామరాజు అందజేశారు.