70% కాంగ్రెస్ మద్దతుదారులు విజయం: ఎమ్మెల్యే రోహిత్

70% కాంగ్రెస్ మద్దతుదారులు విజయం: ఎమ్మెల్యే రోహిత్

MDK: పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. నియోజకవర్గంలో 70 శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవడం ఆనందకరమన్నారు. ఈ విజయానికి కార్యకర్తల కష్టమే కారణమని ప్రశంసించారు. గెలిచిన వారందరితో సమన్వయం చేసుకుని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.