ఆగ్రా వాటర్ ఫాల్స్‌లో తెలంగాణ జవాన్ మృతి

NRML: ముధోల్ మండలం తరోడా గ్రామానికి చెందిన వైమానిక జవాన్ లక్ష్మీప్రసాద్ ఆగ్రాలోని ధమ్మోహ వాటర్ ఫాల్లో గల్లంతై గురువారం మృతి చెందాడు. తోటి ఉద్యోగులతో కలిసి జలపాతానికి వెళ్లిన లక్ష్మీప్రసాద్ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వైమానిక అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారి రోదనలు మిన్నంటాయి.