తుపాను ప్రభావిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

తుపాను ప్రభావిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

E.G: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం రాజమండ్రిలో 'మొంథా' తుపాను వల్ల పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 221 కుటుంబాలకు రూ. 3.61 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తుపాను ప్రభావిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.