దిత్వా ఎఫెక్ట్.. నేడు విద్యా సంస్థలకు సెలవు
అన్నమయ్య: దిత్వా తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.