VIDEO: భారీగా ఎగసిపడుతున్న అలలు
VSP: తుఫాను నేపథ్యంలో విశాఖ సాగర తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి విశాఖలో భారీ వర్షం కురుస్తుండటంతో సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలకు ఎవరిని వెళ్లకుండా అధికారులు పట్టిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.