1800 మంది విద్యార్థుల పరీక్ష ఫీజు కట్టిన మంత్రి సత్యకుమార్
సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ శుభవార్త చెప్పారు. నియోజకవర్గంలోని దాదాపు 1800 మంది విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజును ఆయన తన వ్యక్తిగత వేతనం నుంచే చెల్లించారు. ఇందుకోసం రూ.2.34 లక్షలను సమర్పించారు. విద్యార్థులు బాగా చదివి, మంచి మార్కులు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.