ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VZM: తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎస్.కోట మండల కేంద్రంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముఖ్యఅతిథిగా పాల్గొని, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.