'అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం': ఎమ్మెల్యే
MBNR: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగం వల్లనే బలహీన వర్గాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు.