నేడు గౌరీ పరమేశ్వరుల పండగ
AKP: మునగపాక మండలం చూచుకొండలో శనివారం గౌరీ పరమేశ్వరుల పండగను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గౌరీ పరమేశ్వరులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా ఏర్పాట్లు చేసామన్నారు. సాయంత్రం నిర్వహించే ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసామన్నారు.