VIDEO: సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు

VIDEO: సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు

HYD: నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరమైన పదజాలంతో కామెంట్స్ చేస్తూ వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.