29 మంది MEOలకు నోటీసులు

NLR: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించని జిల్లాలోని 29 MEOలకు DEO బాలాజీ రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఫేస్ రికగ్నైజ్ యాప్(FRS)లో హాజరు నమోదు చేసుకోవాలి. అయితే అందుకు భిన్నంగా వారు హాజరు నమోదు చేసుకోకపోవడంతో సంజాయిషీ కోరుతూ.. నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.