చోరీ కేసులో నిందితుడి అరెస్టు

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

PDPL: ఈశాల తక్కల్లపల్లిలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులో పెద్దంపేట గ్రామానికి చెందిన పరకాల అశోక్‌ను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. చోరీ చేసిన నగలను అమ్మడానికి అశోక్ బుధవారం పెద్దపల్లికి వెళ్తున్నాడు. బసంతనగర్ బస్టాండ్ వద్ద పోలీసులను చూసి పారిపోతుండగా తనను పట్టుకుని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.