ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

KDP: విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న కడప జిల్లా రామాపురం గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు డి. ఆనంద్ రాజుని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సన్మానించారు. ఆయన అంకితభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.