ఈనెల 30న మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం

VZM: గజపతినగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈనెల 30వ తేదీ సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజులు హాజరవ్వాలని కమిటీ సభ్యులు శుక్రవారం కోరారు.