'ఈనెల 10వ తేదీలోపు పన్నులు చెల్లించాలి'
VZM: చీపురుపల్లి గ్రామపంచాయతీ 2025-26 సం ఇంటి పన్ను బకాయిలను తక్షణమే వసూళ్లు చెల్లించాలని ఈవో ఝాన్సీ రాణి మంగళవారం తెలిపారు. అన్ని వీధులలో, ప్రధాన రహదారుల్లో ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈనెల 10వ తేదీలోపు ఇంటి పన్ను కట్టి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.