‘మా కూతురుని మాకు ఇప్పించండి’

‘మా కూతురుని మాకు ఇప్పించండి’

W.G: జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట ఇటీవల వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మైసన్నగూడెంలో ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించారనే ఉద్దేశంతో అక్కడ రాజు అనే వ్యక్తిపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదురుగా యువతి తల్లి మాట్లాడారు. మా కుమార్తెను మాకు ఇప్పించండి’అని కన్నీరు పెట్టుకుంది.