గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే: తాటికొండ సీతయ్య

SRPT: మహిళలకు పాఠశాలలు స్థాపించి విద్య నేర్పిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, రాములు గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.