నరసింహ అవతారంలో శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి

అన్నమయ్య: రామసముద్రం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ జనార్ధనస్వామి రథోత్సవంలో భాగంగా గురువారం స్వామివారు శ్రీలక్ష్మీ నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు పార్థసారధి భక్తులకు దర్శనభాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.