గణేష్ ఉత్సవ కమిటీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

KRNL: ఎమ్మిగనూరులో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో MLA జయనాగేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనాలు, అనుమతుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం వినాయక విగ్రహాలు నిమజ్జనం స్థలాన్ని పరిశీలించారు.