VIDEO: నీటి కుక్కలు ప్రత్యక్ష్యం.. ఆందోళనలో మత్స్యకారులు
NRML: భైంసా మండలం ఇలేగాం, సిరాల గ్రామాల శివారు కొత్త చెరువులో శనివారం నీటి కుక్కలు ప్రత్యక్షమయ్యాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వాటిని చూసి రైతులు, మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. కొందరు గ్రామస్థులు వీటిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ నీటి కుక్కలు కనిపించలేదని, వీటి రాకతో చేపల వేటకు వెళ్లాలంటేనే భయమేస్తోందని వాపోయారు.