రాజ్యసభకు CM.. భావోద్వేగ పోస్ట్
బీహార్ సీఎం నితీష్ కుమార్ తన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపు తీసుకున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు 'X వేదికగా వెల్లడించారు. గత రెండు దశాబ్దాలుగా తనను ఆదరించిన బీహార్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ అసెంబ్లీ, కౌన్సిల్‌తో పాటు లోక్‌సభ, రాజ్యసభ.. ఇలా నాలుగు సభల్లోనూ సభ్యుడిగా పనిచేయాలనేది తన చిరకాల కోరిక అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వివరించారు.