ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ
SRPT: చివ్వెంల మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని ఎస్సై వీ. మహేశ్వర్ ఈరోజు సూచించారు. అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. వ్యక్తిగత విమర్శలు, ప్రచార సమయంలో ఘర్షణలకు తావివ్వవద్దని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలకు, డీజేల వినియోగానికి పూర్తిగా అనుమతులు లేవని ఎస్సై తెలిపారు.