స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO
TPT: ఇటీవల తుఫాను ధాటికి తిరుపతి జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో కుమార్ వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.