VIDEO: విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: మామిడికుదురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని టెన్త్, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయాలన్నారు.