సూది వైద్యంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ
E.G: రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఆస్పా భారత్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ రావు అధ్యక్షతన ఆక్యుపంక్చర్ సూది వైద్యం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానకి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని మాట్లాడుతూ.. ఈ వైద్యం చాలా ప్రాచీన కాలం నుంచి ఉందని, దీని వల్ల పేషంట్‌కి ఆర్థిక భారం ఉండదని, ఎటువంటి అనారోగ్యానైనా ఇది తగ్గిస్తుందని పేర్కొన్నారు.