బ్రాహ్మణచెరువులో 104 వైద్య శిబిరం
W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో మంగళవారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ డాక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామంలో పర్యటించి, పలువురికి మధుమేహం, రక్తపోటు వంటి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రామకృష్ణ, ఏఎన్ఎం లక్ష్మి, ఎంఎల్ హెచ్ పీ.స్వాతి, అంగన్వాడీ టీచర్ సువర్ణ, మేల్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.