రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
HYD: మేడ్చల్ జిల్లా కీసర PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్గర్‌పల్లి, తిమ్మాయిపల్లి టర్నింగ్ వద్ద పల్సర్ బైక్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కనకరాజు, అరుణ్‌గా గుర్తించారు. జవహార్ నగర్ నుంచి యాద్గర్ పల్లికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.