భారీ వర్షాలకు జలమయమైన రామిరెడ్డి నగర్

GNTR: రామిరెడ్డినగర్ ప్రాంతం మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వర్షపు నీటిని తొలగించాలని స్థానికులు కోరారు.